ఏపీ అవినీతిలో ముందుకు దూసుకుపోతున్నది. ఎక్కడ చూసిన ,హత్యలు,రేప్ లు,లంచాలు ఇలా నేరాలు ఎన్ని రకాలు అన్ని ఏపీలో జరుగుతున్నాయి. బల్ల కింద చెయ్యి పెట్టి లంచాలు తీసుకునే రోజులు పోయాయి! ఏపీలో బల్లపైనే… బహిరంగంగానే! సచివాలయంలోని కీలక విభాగంలో కనిపించిన సీన్ ఇది! ఈ ఫొటోలో ఉన్నది అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి అధికారి. ఫైలును కింది నుంచి పైకి ఫార్వర్డ్ చేయడం ఆయన పని! శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇద్దరు మహిళలు వచ్చి ఆయన ముందు కూర్చున్నారు. వారిలో ఒక మహిళ తన పర్సులోంచి కొన్ని 2వేలు, ఐదొందల నోట్లు తీశారు. మొత్తం ఐదారువేల రూపాయలకు పైగానే ఉంటాయి! ఏమాత్రం బెరుకు లేకుండా డబ్బును టేబుల్‌పై పెట్టారు. అతగాడు ఏమాత్రం భయం లేకుండా, ఇచ్చిన డబ్బును అలా టేబుల్‌మీదే ఉంచి… వారికి సంబంధించిన ఫైలును కంప్యూటర్‌లో ఫార్వర్డ్ చేశాడు! ఆ తర్వాత సొమ్ములు జేబులో పెట్టుకున్నాడు!
