అక్కినేని నాగార్జున రెండవ తనయుడు అఖిల్ ఎంగేజ్‌మెంట్ ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే వారసురాలైన శ్రీయా భూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగి పెళ్లికి ముందే ఆబంధం బ్రేక్ అయిన సంగతి తెలిసిందే. ఇక అక్కినేని ఫ్యామిలీకి ముందునుండే జీవీకే ఫ్యామిలీతోనే వ్యాపారం సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే.. సోషల్ మీడియాలో సమంత నాగచైతన్య పెళ్లికి జీవీకే ఫ్యామిలీ అటెండ్ అయ్యిందా లేదా.. ముఖ్యంగా శ్రీయా భూపాల్ వచ్చిందా లేదా అనే చర్చలు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
అయితే ముందుగా చెప్పినట్టు పెళ్లికి అక్కినేని, దగ్గుబాటి, సమంతా కుటుంబీకులతో పాటు.. లిమిటెడ్ సెలబ్రటీస్‌ని మాత్రమే పిలిచారని.. తర్వాత గ్రాండ్‌గా నిర్వహించే రిసెప్షన్‌కి సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులందరిని ఆహ్వానించనున్నారని సమాచారం. దీంతో జీవికే ఫ్యామిలీ కూడా చై-సాంల పెళ్లికి వెళ్ళారా..లేదా అనేది ప్రస్తుతం తెలియకపోగా.. శ్రీయా భూపాల్ మాత్రం తన ఫేస్‌బుక్ పేజలో సమంత- చైతన్యల ఇమేజ్ పెట్టి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ పోస్ట్ పెట్టింంది. దీంతో అఖిల్‌తో బ్రేక్అప్ అయ్యాక శ్రీయా ఫస్ట్ టైం రెస్పాండ్ కావడంతో సోషల్ మీడియాలో సర్వత్రా ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ శ్రీయా జస్ట్ విష్ చేసిందా.. లేక అక్కినేని ఫ్యామిలీతో రిలేషన్‌ని కోరుకుంటుందా.. అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.