టాలీవుడ్ క్యూట్ లవర్స్ నాగచకైతన్య-సమంతలు పెళ్లి శుక్రవారం రాత్రి 11 గంటల 52 నిమిషాలకు అంగరంగ వైభవంగా జరిగింది. మొదట హింధూ పద్దతిలో చైతన్య.. సమంత మెడలో మూడుముళ్లు వేశాడు. శనివారం మరోసారి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ తతంగం సాయంత్రం 5.30 నుంచి షురూ కాబోతోంది. ఇక మొదటి రోజు పెళ్లి వేడుకలో చాలా విశేషాలు చోటుచేసుకున్నాయి. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు రెండూ ఎలాంటి అమరికలు లేకుండా ఫుల్‌గా ఎంజాయ్ చేశాయి.
నాగార్జున రెండో కొడుకు అఖిల్.. పెళ్లి పెద్దలా అన్నీతానై అతిథులకు ఏం కావాలో దగ్గరుండి చూసుకోవడం మరో హైలెట్. నాగార్జున-అమల కలిసి దగ్గరుండి నాగచైతన్య పెళ్లిని శాస్త్రోక్తంగా జరిపించారు. ఇక ఈ పెళ్లిలో సురేష్ బాబు, సమంత కలిసి సంగీత్ లో భాగంగా స్టెప్పులేయడం మెయిన్ హైలెట్. గోవాలో బీచ్ పక్కన ఓపెన్ టాప్ లో చిన్నచిన్న టెంట్లు వేసి స్టయిలిష్‌గా పెళ్లి చేశారు. ఓవైపు పెళ్లి సంప్రదాయబద్దంగా జరిగినా.. అతిథి సత్కారాలు మాత్రం వెస్ట్రన్ టైపులో సాగిపోయాయి. అంటే ఎంజాయ్ చేసేవాళ్లు చేయొచ్చు.. పెళ్లి చూడాలనుకునేవాళ్లు చూడొచ్చన్నమాట. పెళ్లికి సంబంధించి ఫొటోలు మాత్రం కొన్నే బయటకొచ్చాయి.