టాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్.. చాలా కాలంగా ప్రేమ పక్షుల్లాగా తమ ప్రేమను పంచుకున్న సమంత- నాగ చైతన్యలు శుక్రవారం రాత్రి నుండి భార్య భర్తలు అయ్యారు. సరిగ్గా రాత్రి 11.52 నిమిషాలకు కుటుంబ సభ్యుల సమక్షం లో వీరు ఒకటయ్యారు. మొదట హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరుగగా, శనివారం క్రైస్తవ పద్ధతి ప్రకారం వివాహం జరగనుంది. ఇక అసలు విషయం ఏంటంటే సామ్-చైతూల పెళ్లి గోవాలోనే జరగడానికి కారణాలేంటని సోసల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ఇక ఫైనల్గా బయటకు వచ్చిన విషయం ఏంటంటే.. సమంత-చైతన్యల పెళ్లి గోవాలో జరగడానికి అసలు కారణం సమంతనే అంట.. సమంతకి అలాంటి ప్రదేశాల్లో వివాహం చేసుకోవాలనే కోరికను మామ నాగార్జున ముందు ఉంచిదట.. దీంతో కాబోయే కోడలు కోరికను తీర్చడానికి నాగార్జునతో సహా ఫ్యామిలీ మొత్తం ఒప్పుకున్నారని సమాచారం.