అక్కినేని నాగచైతన్య- సమంతల పెళ్లి శుక్రవారం గోవాలో సందడి సందడిగా సాగింది. నిత్యం చాలా గంభీరంగా ఉండే దగ్గుబాటి సురేష్ బాబు కూడా ఈ పెళ్లిలో స్టెప్పులు వేశారంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత హంగామాతో సాగిందో. అక్కినేని.. దగ్గుబాటి, సమంతలకు చెందిన కుటుంబ సభ్యులు.. పరిమిత సంఖ్యలో మిత్రులతోనే ఈ పెళ్లి జరిగింది. శుక్రవారం రాత్రి 11.52 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి సంప్రదాయబద్దంగా సాగింది
ఇక శనివారం క్రిస్టియన్ పద్దతిలో మరోసారి పెళ్లి జరగనుంది. ఈ నెలాఖరులో హైదరాబాద్ లో భారీ ఎత్తున రిసెప్షన్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. పెళ్లి తర్వాత అటు సమంత..నాగచైతన్యలు ఇద్దరూ షూటింగ్ బిజీలో పడిపోనున్నారు. ఏ మాయ చేసావెతో ఒకరికొకరు పరిచయమైన నాగచైతన్య, సమంతలు. మనం చిత్రంలోనే ముందస్తుగా ఓసారి పెళ్లి మంత్రాలు చదివేశారు. శుక్రవారం పెళ్లికి కొన్ని గంటల ముందు నాగచైతన్య తండ్రి, హీరో అక్కినేని నాగార్జున తమ ఫ్యామిలీ ఫొటోలను పోస్ట్ చేశారు. చైతూ ఒళ్లో కూర్చుని దిగిన ఫొటోను సమంత షేర్ చేశారు. ఇంకా పెళ్లికి హాజరైన ప్రముఖులు వేడుకలోని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.