Home / ANDHRAPRADESH / ‘వైఎస్సార్‌’ గురించి చెప్పినందుకు పీవీ సింధుకు రూ.25లక్షలు..!

‘వైఎస్సార్‌’ గురించి చెప్పినందుకు పీవీ సింధుకు రూ.25లక్షలు..!

 భారత్‌తోపాటు విదేశాల్లో సైతం విపరీతంగా ప్రాచుర్యం పొందిన టీవీ కార్యక్రమం ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’  తొమ్మిదో సీజన్‌ ఇటీవలే ప్రారంభమైంది. అన్ని సీజన్లలాగే తాజా సీజన్‌ కూడా అద్భుతమైన రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. వీకెండ్స్‌, స్పెషల్‌ డేస్‌లో ప్రసారమయ్యే ఎపిసొడ్లలో పలువురు సెలబ్రిటీలు సందడిచేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

శుక్రవారం ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్‌లో ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ప్రశ్నలకు సమాధానాలిచ్చి రూ.25 లక్షలు గెల్చుకున్నారు. కాగా, ఆమెకు 25 లక్షలు తెచ్చిపెట్టిన ప్రశ్న.. మహానేత వైఎస్సార్‌, ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిలకు సంబంధించింది కావడం విశేషం.

మెడికో అయిన తన చెల్లెలు దివ్యతో కలిసి సింధు హాట్‌సీట్లో కూర్చున్నారు. సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి.. బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తీరును మాటలు, వీడియోల రూపంలో ప్రేక్షకులకు వివరించారు హోస్ట్‌ అమితాబ్‌. వైల్డ్‌ ఎంట్రీగా రూ.20వేల ప్రశ్నతో ఆటను ప్రారంభించిన సింధు.. 8వ ప్రశ్నకు సమాధానం చెప్పి రూ.25లక్షలు గెల్చుకున్నారు. అయితే, అప్పటికే సమయం మించిపోవడంతో ఎపిసొడ్‌ ముగిసినట్లైంది. తాను గెల్చుకున్న మొత్తాన్ని ఆస్పత్రికి వితరణ ఇవ్వనున్నట్లు సింధు ప్రకటించారు.

వైఎస్సార్‌ అంటే ? : సింధును అమితాబ్‌ అడిగిన ఎనిమిదో ప్రశ్న.. ‘ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో వై, ఎస్‌, ఆర్‌ పదాలకు అర్థాలేమిటి?’’  అని అడిగారు. ఎ)యువ సత్య రాజ్యం, బి)యెదుగూరి సందిట రాజశేఖర, సి)యూత్‌ షల్‌ రూల్‌, డి)యువజన శ్రామిక రైతు అనే ఆప్షన్లు ఇవ్వగా, సోదరి సహాయంతో సింధు ‘డి’ ని సమాధానంగా చెప్పారు. వైఎస్సార్‌ రైతుల కోసం ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఆయన పేరుతో స్థాపించిన పార్టీ పేరులో ‘రైతు’  పదం ఉంటుందనే తాను ‘డి’ ఆప్షన్‌ను ఎంచుకున్నట్లు సింధు చెప్పారు. సరైన సమాధానం చెప్పిన సింధూను మెచ్చుకున్న అమితాబ్‌ కూడా వైఎస్సార్‌ రైతుల బాగు కోసం ఎంతో కష్టపడ్డారని కితాబిచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat