పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణూ దేశాయ్.. తాను మరో పెళ్లి చేసుకునే ఆలోచన గురించి చర్చించిన వెంటనే కొందరు పవన్ ఫ్యాన్స్ ఉన్మాదంతో ఊగిపోయారు. ఆమె పెళ్లి చేసుకుంటే అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయని విపరీతమైన లాజిక్ ఉపయోగించి మరీ కామెంట్లు చేశారు. తన అభిమాన హీరో మాత్రం ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్న అంగీకరించిన అభిమానులు అతని మాజీ భార్య చట్టప్రకారం విడాకులు తీసుకున్నాక కూడా వేరే పెళ్ళికి అభిమానులు అభ్యంతరం చెప్పటం ఆమె హక్కులను హరించడం అవుతుంది.
ఒక వ్యక్తి ఎవరిని పెళ్లి చేసుకున్నా అది ఒక అగ్రిమెంట్ లాంటిది మాత్రమే తనకు ఎప్పుడు ఇష్టం లేకపోయినా కోర్ట్ ద్వారా విడాకులు తీసుకునే హక్కు ఉంటుంది. అలా విడాకులు తీసుకున్న ఎవరయినా తనకు ఇష్టమైన ఎవరినన్నా పెళ్లి చేసుకునే హక్కు ఉంటుంది. ఇక రేణూ దేశాయ్ మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ ప్రస్తుత మూడవ భార్య తనకు నచ్చక పోయినా, లేదా పవన్ కన్నా ఎవరన్నా ఎక్కువగా నచ్చినా చట్టప్రకారం విడాకులు తీసుకొని మరొకరిని వివాహమాడి హక్కు ఉంటుందని గ్రహించాలి. పెళ్లి ఇద్దరు వ్యక్తులను కలిపి ఉంచే సామజిక, చట్ట పరమయిన బంధము మాత్రమే తప్ప, పెళ్లి అనేది ఒకరికి మరొకరు బానిసలుగా బ్రతకటానికి కాదు అనే విషయం పవన్ ఫ్యాన్స్‌తో పాటు అందరూ గ్రహించాలని సర్వత్రా చర్చించుకుంటున్నారు.