సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నుండి వెలువడిన లేటెస్ట్ సెన్సేషన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న విషయం తెలిసిందే. ముందుగా బాలకృష్ణతో ఎన్టీఆర్ జీవితగాధను తెరకెక్కిస్తారని భావించగా.. అది వెనక్కి వెళ్ళడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న నామకరణం చేసి ఇటీవల ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసి ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో కాక రేపారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించే పనుల్లో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. దర్శకులు వేటకొనసాగుతునండగా తాజాగా వర్మ శిష్యుడు తేజ డైరెక్టర్‌గా ఫిక్స్ అయ్యారని సమాచారం.
అయితే ఇక అసలు విషయం ఏంటంటే.. వర్మ- లక్ష్మీస్ ఎన్టీఆర్.. తేజ- బాలకృష్ణల ఎన్టీఆర్ బయోపిక్.. ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రంలో ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అసలు నిజాలు బయటకు వస్తాయనే చర్చలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. వర్మ తీసే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో వెన్నుపోటు ఎపిసోడ్‌ను ఈ చిత్రంలో గట్టిగానే చూపించే అవకాశం ఉందని ఇప్పటికే ప్రచారం మొదలైంది. మరి బాలకృష్ణ తీసే చిత్రంలో ఎలాంటి నిజాలు చూపిస్తారు.. బావ చంద్రబాబుని కాదని వైస్రాయ్ ఘటనలని చూపించే ధైర్యం బాలయ్య చేస్తారా.. అనేది తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.