వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. తను చేపట్టదలిచిన పాదయాత్ర నేపథ్యంలో, క్విడ్ ప్రో కో కేసుల విచారణ నుంచి వ్యక్తిగత హాజరు నుండి మినహాయించాలని కోరుతూ మరోసారి కోర్టును ఆశ్రయించారు.నవంబర్ రెండో తేదీ నుంచి ఆరు నెలల పాటు పాదయాత్ర చేపడుతున్నందున, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలంటే కష్టమని సీబీఐ కోర్టులో జగన్ తన పిటీషన్ ను దాఖలు చేశారు. తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తే పాదయాత్ర సజావుగా జరుగుతుందని, అందుకు అనుమతించాలని కోరారు.
ఇక ఈ పిటిషన్ పై విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే జగన్‌కు విరామం ఇవ్వడానికి సీబీఐ సమ్మతిస్తుందా.. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది.. అనేది ఆసక్తిదాయకమైన వ్యవహారం. ఒకవేళ సీబీఐ న్యాయస్థానం జగన్ కు విచారణ నుంచి మినహాయింపును ఇస్తే.. వైసీపీకి అది ఉత్సాహాన్ని ఇచ్చే అంశమే అవుతుంది. అలాజరగకి సీబీఐ కోర్టు నుండి అనుమతి లభించకపోతే జగన్ పాదయాత్ర పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు.