తమిళ్ హీరో జైకి మద్యం మత్తులో కారు నడిపి ఫ్లైఓవర్ గోడను ఢీ కొట్టిన కేసులో.. కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో గురువారం కోర్టులో జై హాజరు కావాల్సి ఉండగా ఆయన రాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సైదాపేటలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అతడిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మద్యం మత్తులో వాహనం నడిపిన కేసులో ఆయన నిన్న న్యాయమూర్తి ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే జై రాకపోవడంతో తీవ్రంగా పరిగణించిన కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గత నెల 21న జై మద్యం మత్తులో కారు నడుపుతూ చెన్నైలోని ఆడ్యార్ ఫ్లై ఓవర్‌ను ఢీ కొట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ని అరెస్టు చేయగా.. బెయిలుపై విడుదలయ్యారు. ఈ కేసులో గురువారం కోర్టులో జై హాజరు కావాల్సి ఉండగా ఆయన రాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సైదాపేటలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అతడిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.