జనసేన పార్టీ పై అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేతలు సమయం దొరినప్పుడల్లా పచ్చబుద్ధిని చూపిస్తున్నారు. ఆ మధ్య చింతమనేని ప్రభాకర్ ఏకంగా.. ఎవడెవడో వచ్చి తామే టీడీపీని గెలిపించామంటే ఒప్పుకునేది లేదన్నారు. అసలు సొంత అన్న చిరంజీవిని గెలిపించుకోలేనోడు టీడీపీని గెలిపించాడా అంటూ చింతమనేని ఆ మధ్య పవన్‌ను హేళన చేశారు. మరో సందర్బంలో టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప.. పవన్‌ను ఉద్దేశించి ఎంగిలాకులు ఎత్తే వ్యక్తి అంటూ హేళన చేశారు. ఇక కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అయితే ఏకంగా పవన్ కల్యాణ్ అంటే ఎవరో తనకు తెలియదన్నారు.
ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్ గురించి ఆలోచించే సమయం కూడా తమకు లేదని, ఆ పార్టీ నిర్మాణాత్మకంగా లేదంటూ మంత్రి పితాని వ్యాఖ్యలు చేసారు. దీంతో పచ్చ బ్యాచ్‌పై పవన్ సెటైరికల్‌గా ఇచ్చిన కౌంటర్ రాజకీయ వర్గాల్లో హట్ టాపిక్‌గా మారింది. ఇక ఆయన ఈ ట్వీట్ చేసిన తర్వాత అనేక మీడియా ఛానళ్లు దీనిపై కథనాలు ప్రసారం చేయడంతో ఈ విషయం చంద్రబాబు వరకు వెళ్ళడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారట. పవన్ కల్యాణ్‌ను ఏమీ అనొద్దని పార్టీ నేతలకు చంద్రబాబు హుకుం జారీ చేశారట. భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని విమర్శలు చేయాలని తెలుగు తమ్ముళ్ళకు సూచించారని సమాచారం. ఇకపై పార్టీ అనుమతి లేకుండా ఇటువంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయవద్దని ఆయన పార్టీ నాయకులను ఆదేశించినట్లు తెలుస్తోంది.