తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికల్లో శ్రీరాంపూర్ డివిజన్‌లో ఊహించినట్టే జరిగింది. తెలంగాణ అన్నంగిన్నె లాంటి సింగరేణి కార్మికులు తమ ఇంటి సంఘానికి బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ బొగ్గుగని సంఘం తిరుగులేని మెజార్టీతో మరోసారి గుర్తింపు హోదా ఖరారైంది. ప్రత్యర్థులంతా ఒక్కటై కూటమి కట్టినా.. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. టీబీజీకేఎస్ బాణం గుర్తు దూసుకుపోయింది..కార్మికులంతా సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ అధ్యక్షురాలు ఎంపీ కవితల వెంటే నిలిచారు.దీనిలో భాగంగా శ్రీరాంపూర్ లో ఇంటిసంఘం అయిన టీబీజీకేఎస్ 2243 ఓట్ల భారీ మెజార్టీతో ఏఐటీయూసీపై ఘనవిజయం సాధించింది. ఇక్కడ పోలైన 11265 ఓట్లలో టీబీజీకేఎస్‌కు 6189 ఓట్లు రాగా, ఏఐటీయూసీకి 3916 ఓట్లు పోలయ్యాయి.
ఈ క్రమంలో సింగరేణి ఎన్నికల సమరశంఖం మోగిన రోజు నాటి నుండి ఎన్నికల పోలింగ్ రోజు వరకు టీబీజీకేఎస్ సంఘం నేతలు,టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు,యువనేత ఎంపీ బాల్క సుమన్ నాయకత్వంలో ఎన్నికల ప్రచారంలో ఎప్పటికప్పుడు ఎన్నికల వ్యూహ్యాలను ,ప్రణాళికలను సిద్ధం చేస్తూ వాటిని అమలు చేస్తూ ప్రచారంలో దూసుకు వెళ్ళారు.దీనిలో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా సింగరేణి కార్మికులకు తమ ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడంలో ఎంపీ బాల్క సుమన్ విజయవంతమయ్యారు..వారసత్వ ఉద్యోగాల దగ్గర నుండి వడ్డీ లేని రుణాలను మంజూరు చేసి ప్రతి సింగరేణి కార్మికుడికి సోంత ఇంటి కలను ఎలా నెరవేరుస్తారో…సింగరేణి కార్మికుల జీవితాలను ఎలా బంగారు మాయం చేస్తారో అన్నిటిని సవివరంగా విరించడంలో సఫలికృతుడైనాడు ..
ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్షాలు చేసే అసత్య ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికోడుతూ గతంలో ప్రతిపక్షాలు సింగరేణికి ,కార్మికులకు చేసిన ద్రోహాలను,మోసాలను వివరిస్తూ కార్మికులలో ,కార్మిక సంఘాల నాయకులలో చైతన్యం తీసుకు వచ్చారు…ఎంపీ బాల్క సుమన్ మరియు టీబీజీకేఎస్ సంఘం నేతలు,టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేసిన ప్రచారం మూలంగా ,సర్కారు కార్మికులకు చేస్తున్న పలు కార్యక్రమాలకు ఆకర్శితులై పలు సంఘాలకు చెందిన నాయకులను,కార్మికులను తమవైపు తిప్పుకోవడంలో ఈ యువనేత ఘనవిజయం సాధించారు…ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎంపీ కవిత మార్గదర్శకత్వంలో మంత్రి కేటీఆర్ సూచనలు,సలహాలు పాటిస్తూ శ్రీరాంపూర్ లో ఇంటి సంఘం ఘనవిజయం సాధించడంలో ఎంపీ బాల్క సుమన్ ఈ ఎన్నికల సమరంలో అన్ని తానై నడిపించి ప్రముఖ పాత్ర పోషించాడు…