తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చారు. అన్ని శాఖల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల వివరాలు సేకరించి.. వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలున్న అభ్యర్థులు ఆయా వర్గాల్లో ఉన్నప్పటికీ బ్యాక్లాగ్ పోస్టులు ఉండటం అన్యాయమన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్ కలిసి ఇకపై ప్రతీ నెలా చివరి రోజున సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారు.
