తమిళనాడులోని పుదుకోట జిల్లా విరాలిమలై వద్ద కారులో తరలిస్తున్న పురాతన మరకత లింగాన్నిస్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విరాలిమలై వద్ద శుక్రవారం ఉదయం వేగంగా వెళుతున్న కారును రాష్ట్ర రవాణాసంస్థ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం తిరుచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ప్రమాదానికి గురైన కారును తొలగిస్తుండగా వెనుక సీటులో మరకత లింగం కనిపించింది. 8 కిలోల బరువున్న మరకత లింగం విలువ రూ.20 కోట్లకు పైగా ఉంటుందట. ఈ మరకత లింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
