మూడు ముళ్ల బంధంతో మెట్టినింటికి వెళుతున్న సమయంలో ప్రతి ఆడపిల్ల భావోద్వేగానికి గురౌతుంది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉన్నా సరే.. తల్లిదండ్రులకు దూరమౌతున్నందుకు మనస్సులోతుల్లో బాధగానే ఉంటుంది. కథానాయిక సమంత కూడా ఇలానే భావోద్వేగానికి గురయ్యారు. పెళ్లి పీటలపై ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఆ క్షణంలో తీసిన ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.‘ఈ ఫొటో గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు. నిన్న తీసిన షాట్ ఇది. అలెన్జ్ ఈ అశాశ్వతమైన భావోద్వేగాన్ని చిత్రీకరించారు. పోజు ఇచ్చి దిగే ఫొటోల కన్నా.. రియల్ మూమెంట్స్‌లో తీసే ఫొటోలు ఎప్పుడూ అపురూపంగా ఉంటాయి. పెళ్లికూతురు సమంత భావోద్వేగానికి గురైనప్పుడు.. చాలా చాలా సంతోషం మధ్యలో ఆనంద బాష్పాలు’ అని ఆమె రాశారు.
