తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే ,ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు అయిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు .ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై చేసిన కామెంట్ల గురించి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇక నుండైన జరిగే ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ను ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ మనస్పర్థలు వీడి ఒక్క తాటిపైకి రావాలని విజ్ఞప్తి చేశారు. విపక్షాల మధ్య ఉన్న బలహీనతలనే కేసీఆర్కు బలంగా మారుతున్నాయనేది సింగరేణి ఎన్నికల్లో రుజువైందన్నారు. ఈ ఎన్నికల్లో తెరాస అనుబంధ సంఘానికి 45 శాతం ఓట్లు వస్తే.. విపక్షాలకు 55 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని మరవరాదన్నారు.
