తెలుగుదేశం పార్టీపై ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుతో సన్నిహితంగా ఉన్నవారందరిని తెలుగుదేశం పార్టీ పక్కనపెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.విజయవాడలో ఆయనకు సావిత్రి కళాపీఠం ఆద్వర్యంలో సన్మానం జరిగింది.తాను కూడా పార్టీ వ్యవస్థాపక సభ్యుడినేనని ఆయన చెప్పారు.తనను టిడిపి ప్రభుత్వం ఏనాడు సంప్రదించలేదని ఆయన అన్నారు. టీడీపీ ప్రారంభం నుంచి ఎన్టీఆర్తో కలసి తిరిగానని, ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడానికి అన్నగారు ప్రయత్నం చేశారని చెప్పారు. అయితే విధి అనుకూలించక అది సాధ్యం కాలేదన్నారు.తదుపరిమచిలీపట్నం నుంచి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచానని తెలిపారు.నమ్మక ద్రోహంతోనే పదవి పొగొట్టుకున్న సమయంలో ఎన్.టి.ఆర్.ఎంతో బాద పడ్డారని సత్యనారాయణ చెప్పారు.ఆయన తనను నమ్ముకున్నవాళ్లందరికి ఏదో ఒకటి చేశారని ఆయన కైకాల పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ పురస్కారాల వెనక పెద్ద లాబీ ఉండాలని, అది తనకు లేదన్నారు.
