తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ జాక్ ఛైర్మన్ ప్రో కోదండరాం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు అయిన శ్రీమతి సోనియాగాంధీని కలిశారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి .ఆ తర్వాత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కూడా ప్రో కోదండరాం సోనియా గాంధీ రహస్య భేటీపై పలు విమర్శలు ..ఆరోపణలు చేశారు .అయితే అప్పట్లో ప్రో కోదండరాం సోనియాగాంధీని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో కల్సి భేటీ జరిపారు .
ఈ భేటీ సందర్భంగా ప్రో కోదండ రాం ను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వాలని ..అప్పటి ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల మ్యాన్ ఫేస్ట్ అప్పటి కేంద్ర మంత్రి జైరాం రమేష్ తో కల్సి తయారుచేశారు .అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలకు సీట్లు ఇప్పించడంలో కూడా కోదండరాం ప్రధాన పాత్ర పోషించారు .తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గాన్ని అధికారంలోకి రావడానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు .
అందుకే అమరుడైన శ్రీకాంత చారీ తల్లి శంకరమ్మ పోటి చేస్తే కనీసం ప్రో కోదండ రాం ప్రచారం నిర్వహించలేదు అని అధికార పార్టీ నేతలు ఆరోపించారు .తాజాగా నిన్న మీడియా తో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “తెలంగాణ ఏర్పడుతున్న తరుణంలో రహస్యంగా దిగ్విజయ్ సింగ్ తో కల్సి కోదండ రాం సోనియాగాంధిని కలిశారు .పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు .అమరుల స్పూర్తియాత్ర అన్నడు .అసలు అమరుడు శ్రీకాంత చారీ తల్లి ఎన్నికల్లో నిలబడితే ఎందుకు ప్రచారం చేయలేదు .లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకొని కోదండ రాం ఇలా మాట్లాడుతున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు .