ప్రస్తుత రోజుల్లో ‘కాకా.. వాడి కండలు… సిక్స్ ప్యాక్… ఫ్రెంచ్ గడ్డం… మస్త్ మ్యాన్లీరా వాడు! అమ్మాయిలు క్యూ కట్టేస్తారు. నేనూ వాడిలా హీరో లెక్క మారిపోవాలి. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.’ అని పాకెట్ మనీ అంతా ఖర్చు చేస్తున్నారు. అంత కాస్ట్లీ కంగారక్కర్లేదు. పురుష లక్షణాలకు కొత్త నిర్వచనాన్నిస్తున్నారు నేటి తరం అమ్మాయిలు. మ్యాన్లీ మాత్రమే కాదంటూ సున్నితత్వాన్నీ కోరుకుంటున్నారు.
ఒక సంస్థ చేసిన సర్వేలో తేలిందేమంటే ఏడ్చే మగాడి కన్నీటికే నిజాయతీ ఎక్కువని. అలాంటి వారిని నమ్మడానికి సందేహించక్కర్లేదని తేల్చారు. అంతేకాదు… ఉద్యోగం పురుషలక్షణం అంటూ వంటకి దూరంగా ఉండేవారంటే మక్కువ చూపించరట. నలభీముడిలా రుచికరమైన వంటలు చేసేవారికే తమ ఓటని వయ్యారి భామలు ఒట్టేసి చెబుతున్నారు. ఏడ్చే మగాడిని నమ్మెద్దనే పాత ఫార్ములాకి ఇదో కొత్త ఈక్వేషన్ అనొచ్చు.