హైదరాబాద్‌లో పలు కూడళ్లలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి యూ టర్న్ పద్దతి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో రేపటి నుంచి ఎల్బీనగర్ కూడలిని మూసివేస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. యూ టర్న్ పద్దతిని ఎల్బీ నగర్ చౌరస్తాలో రేపటి నుంచి అమలు చేయనున్నట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. మెట్రో రైలు, స్కైవే పనులు జరుగుతున్నందున్న ఎల్బీనగర్ కూడలి మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. ఎల్బీనగర్ కూడలిని మూసివేసి ఎల్పీటీ మార్కెట్, డీమార్ట్ ముందు యూ టర్న్‌లు తెరుస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిలో యథావిధిగా రాకపోకలు కొనసాగనున్నాయి. కాగా విజయవాడ నుంచి ఉప్పల్ వెళ్లే వాహనాలు ఎల్బీనగర్ చౌరస్తా దాటాక డీ మార్ట్ వద్ద కుడివైపు యూ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది.
