Home / EDITORIAL / అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ..!

అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ..!

అవును…అఖండ భారతాన 31 జిల్లాల నవ తెలంగాణ నేడు సగర్వంగా వెలిగిపోతుంది..మూడున్నర ఏళ్ళ  పసికందు ఇంతింతై వటుడింతై అన్నట్లు అన్ని రంగాల్లో సమున్నత అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తలెత్తుకుని నిలబడింది.. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలో దూసుకుపోతుంది..ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎక్కడా లేని విధంగా 40 సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే అతి పెద్ద సంక్షేమం రాష్ట్రంగా నిలిచింది..మరో పక్క ఆదాయాభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. అంతే కాదు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో కూడా తెలంగాణ దేశంలోనేనెంబర్ వన్ రాష్ట్రంగా నిలవడం అభినందనీయం.

కొత్త రాష్ట్రం, కొంగొత్త ఆశలు, మరో వైపు ఎన్నో అనుమానాలు, మరెన్నో భయాందోళనలు..అయితే ప్రత్యేక తెలంగాణ కోసం 14 ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటం చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల 60 ఏళ్ల స్వరాష్ట్ర కలను తీర్చిన కేసీఆర్ తెలంగాణ తొలిపాలకుడిగా ఎక్కడా మడమ తిప్పలేదు..అసాధారణ రీతిలో తెలంగాణను మూడేళ్లలోనే దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారు. ఓ పక్క సీమాంధ్ర శక్తుల కుట్రలను చేధిస్తూ.. మరో పక్క 60 ఏళ్లలో ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మాణం చేసే బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకున్న కేసీఆర్ ఆ దిశగా తిరుగులేని విజయంసాధిస్తున్నారు..తొలి ఆర్నెళ‌్లలోనే తెలంగాణను కరెంట్ కోతల్లేని రాష్ట్రంగా నిలిపారు . ఇప్పుడు తెలంగాణ దేశంలోనే కోతల్లేని నిరంతర విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంగా నిలిచింది..

తెలంగాణ ఇప్పుడు విద్యుత్ కాంతులతో తళుకులీనుతుంది. అలాగే తెలంగాణ వస్తే శాంతి భద్రతలు కరువు అవుతాయి…అరాచకం ప్రబలుతుంది..నక్సలిజం పెరుగుతుంది అని సమైక్యవాదులు రేకెత్తించిన భయాందోళనలను సీఎం కేసీఆర్ పటాపంచలు చేశారు. అధికారంలోకి రాగానే పోలీస్ వ్యవస్థను అత్యాధునీకరించారు..పోలీసులకు అత్యాధునిక వాహనాలు, ఆయుధాలు,సమకూర్చారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు..మరో వైపు ఉగ్రవాద మూలాలను పెకిలిస్తున్నారు.సీఎం కేసీఆర్ పెట్టిన ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రశాంతంగా మారింది. భాగ్యనగరంలో మళ్లీ శాంతిభద్రతలు, మత సామరస్యం వెల్లివిరుస్తున్నాయి.

ఈ మూడేళ్లలో సీఎం కేసీఆర్ గారు తీసుకున్న పాలనా పరమైన నిర్ణయాలు తెలంగాణకు వరంగా మారాయి..ఈ మూడేళ్లలోనే తెలంగాణ దేశంలోనే తలసరి ఆదాయం అత్యధికంగా గల రాష్ట్రంగా నిలిచింది..ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఇండస్ట్రియల్ పాలసీ, ఐటీ పాలసీతో నేడు ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది.ఐటీ, ఫార్మా, కన్ స్ట్రక్షన్ , ఇన్ ఫ్రాస్గ్రక్చర్ రంగాలలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు, కొంగొత్త పరిశ్రమలు స్థాపించటానికి ముందుకు వస్తున్నాయి..రెండున్నరేళ్లలో తెలంగాణ పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు స్వర్గధామంగా మారింది..

ఈ మూడేళ‌్లలో సీఎం కేసీఆర్ దూరదృష్టితో చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం , నిరంతర విద్యుత్తు సరఫరా ఇత్యాది కార్యక్రమాల పట్ల తెలంగాణ ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు..అరవై ఏళ్లలో సమైక్య పాలనలో వివక్షకు గురైన తెలంగాణ ప్రజల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొంగొత్త వెలుగులు తీసుకువస్తున్నారు..పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు..అలాగే ప్రత్యక్షంగా ప్రజలకు చేరుతున్న పింఛన్లు, ఒంటరి మహిళలకు రూ. 1000 పింఛన్లు, పేదల కడుపు నింపుతున్న రేషన్ బియ్యం, పేదల ఆరోగ్యాన్ని పరిరక్షించే ఆరోగ్య శ్రీ, పేదింటి అమ్మాయిల వివాహానికి ఆర్థిక సహాయం అందించే కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు , గర్భిణీ స్త్రీలకు, శిశువుల ఆరోగ్యం కోసం కేసీఆర్ కిట్లు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పేదల సొంతింటికలను నిజం చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇలా పలు ప్రజా సంక్షేమ పథకాలతో తెలంగాణ మూడేళ్లలోనే దేశంలోనే అతి పెద్ద సంక్షేమ రాష్ట్రంగా పేరుగాంచింది.. సీఎం కేసీఆర్ చేపడుతున్న,వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు క్షేత్ర స్థాయిలో పారదర్శంగా అందుతుండడంతో తెలంగాణ ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

ఇక సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా కనుమరుగైన 40 వేల చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా పునరుద్దరించారు..సీఎం కేసీఆర్ గారు చేసిన ఆయుత చండీయాగ ఫలితమో ఏమోగానీ గత 20 ఏళ్లుగా అఖండ భారతాన్ని పట్టి పీడిస్తున్న ఎలినినో భూతం వీడింది..తెలంగాణలో గత 20 ఏళ్లలో ఎన్నడూ కురవని వర్షాలు కురిసి చెరువులన్నీ నిండాయి..ఇప్పుడు తెలంగాణలో పల్లెనా జల కళ, పచ్చదనం ఉట్టిపడుతుంది.. మరో మూడేళ్ల పాటు సాగుకు ఢోకా ఉండదని రైతులంతా సంతోషపడుతున్నారు.. అలాగే రైతులకు 9 గంటల పాటు పగటిపూటనే నిరంతర విద్యుత్ అందిస్తున్నారు..అంతే కాదు వచ్చే ఏడాది నుంచి రైతులకు కూడా 24 గంటల నిరంతర విద్యుత్ అందించబోతున్నారు.

ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీని నాలుగువిడతలుగా మొత్తం రూ. 17, 000 కోట్ల రుణాలను పూర్తిగా మాఫీ చేశారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న పథకం చేపడుతున్నారు సీఎం కేసీఆర్. రైతన్నలు సాగు కోసం అప్పులు బారిన పడకుండా ఉండడం కోసం విత్తనాల కోసం ఒక్కో ఎకరానికి 4,000 అందిస్తున్నారు. రైతన్నలకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 4 వేలు ప్రభుత్వమే అందిస్తుంది. దీంతో రైతన్నలు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఉండదు..ఇలా రైతు బాంధవుడు కేసీఆర్ పాలనలో తొలిసారిగా రైతుల కళ్లలో సంతోషం కనిపిస్తుంది..మరో వైపు సీఎం కేసీఆర్..అపర భగీరథుడు వలె తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పలు భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు..వచ్చే నాలుగైదు ఏళ్లలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలంగా మారడం ఖాయం.

ఇక తెలంగాణ ఆడబిడ్డల తాగునీటి కష్టాలు తీర్చడానికి తెలంగాణ అంతటా ఇంటింటికి నల్లానీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికి సురక్షిత తాగు నీరు అందించే ఈ పథకాన్ని సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రశంసించడమే కాదు…స్వయంగా మిషన్ భగీరథ తొలి ఫలితాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అంతే కాదు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు పిలుపు ఇవ్వడం తెలంగాణకే
గర్వకారణం..

స్వరాష్ట్రంలో ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, అంగన్ వాడీ వర్కర్స్, పోలీసులు, హోంగార్డులు మున్సిపల్ కార్మికులు, ఆశావర్కర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇలా సబ్బం వర్ణాల వారికి జీతాలు రెట్టింపు చేసి వారి జీవితాల్లో సరి కొత్త కాంతులు ప్రసాదించారు సీఎం కేసీఆర్..కాంట్రాక్ట్ ఉద్యోగాలను, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను క్రమబద్దీకరించబోతున్నారు. ఒకప్పుడు తెలంగాణ ఎక్కడ చూసినా ఆకలి బాధలతో, అవినీతి , అరాచకత్వంతో అల్లాడిపోయేది..కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ నీతివంతమైన పాలన అందిస్తున్నారు..దీంతో ప్రజలంతా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు క్షేత్ర స్థాయిలో సామాన్యుడికి చేరగలుగుతున్నాయి..దీంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరి జీవితాలు మెరుగుపడ్డాయి..

ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండగలుగుతుంది..మరో వైపు పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ పది జిల్లాల తెలంగాణను 31 జిల్లాల తెలంగాణగా విభజితం చేశారు..దీంతో తెలంగాణలో సరికొత్త శకం మొదలైంది. సీఎం కేసీఆర్ గారి సారథ్యంలో అటు సంక్షేమం , అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం అఖండ భారతాన వెలుగు జిలుగులు విరజిమ్ముతుంది…తెలంగాణ మూడేళ‌్ల విజయ ప్రస్థానం అప్రతిహాతంగా సాగిపోతూనే ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మూడేళ్ల పసికూన తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవడం నిజంగా తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం..సీఎం కేసీఆర్ తొలి పాలకుడు కావడం నిజంగా తెలంగాణ ప్రజల అదృష్టం. ఆయన నిండు నూరేళ్లు ఇలాగే ఆయురారోగ్యాలతో కలకాలం తెలంగాణను ఇలాగే పాలించాలని, ఆయన సారథ్యంలో బంగారు తెలంగాణ కల సాకారం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు..ఎందుకంటే తెలంగాణ అంటే కేసీఆర్..కేసీఆర్ అంటే తెలంగాణ…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat