అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా..కార్మికులు టీబీజీకేఎస్‌ను ఏకపక్షంగా గెలిపించారన్నారు. కార్మికులంతా టీబీజీకేఎస్‌ను గెలిపించినందుకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.. ఇవాళ ప్రగతి భవన్‌లో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను తూచూ తప్పకుండా నెరవేరుస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారన్నారు. సింగరేణి ఎన్నికల్లో గతంలో 45 శాతం ఓట్లతో గెలిచిన సంస్థ ఏదీ లేదన్నారు. విపక్షాలు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని నిర్మాణాత్మకంగా పనిచేయాలని సీఎం సూచించారు. ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు విపక్షాలు మద్దతు ఇవ్వాలన్నారు.
భూసర్వేపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సీఎం ఫైరయ్యారు. రాష్ట్రంలో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొన్నదని, భూసర్వేపై గవర్నర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అయితే పరిస్థితిని సమీక్షించిన గవర్నర్ తమ ప్రభుత్వం చేపట్టిన భూసర్వేను మెచ్చుకున్నట్లు గుర్తు చేశారు. రాజకీయాల్లో ఇంత అసహన, నెగటివ్ వైఖరి మంచికాదన్నారు. సానుభూతి పవనాలు తట్టుకుని ఎన్నికలు గెలవడం చరిత్ర అని సీఎం అన్నారు. వరంగల్ ఎన్నికలు గెలవడం చరిత్రే, జీహెచ్‌ఎంసీ గెలవడం చరిత్రే, అదో రికార్డు బ్రేక్, సింగరేణి కూడా మామూలు విజయం కాదు. ఇంత మెజారిటీ, ఇన్ని డివిజన్లు గతంలో ఎవరూ ఎప్పుడు గెలవలేదు అని సీఎం అన్నారు. సింగరేణిలో ఏఐసీసీ నాయకుడు కుంతియా వచ్చి ప్రచారం చేయడం విడ్దూరమన్నారు. విపక్షాలకు ఇంత పెద్ద ఆర్భాటం ఎందుకన్నారు. భూముల సర్వేను వ్యతిరేకించడం అంటే మీ దీన స్థితి తెలుస్తుందన్నారు.