సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 11 డివిజన్లలో 9 డివిజన్లను టీబీజీకేఎస్ కైవసం చేసుకున్నది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యహం ఫలించింది. ఏఐటీయూసీకి పట్టున్న ఇల్లెందు, మణుగూరు ఏరియాలో టీబీజీకేఎస్ ఘన విజయం సాధించింది. మిత్ర పక్షాలకు కంచుకోటగా నిలిచిన రెండు ఏరియాలపై గులాబీ జెండా రెప రెపలాడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం ఏరియాతో పాటు కార్పొరేట్, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయం సాధించటంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మణుగూరు, కొత్తగూడెం ఏరియాలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీకి పట్టు ఉండటంతో అక్కడ టీబీజీకేఎస్ గెలుపు బాధ్యతలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీసుకున్నారు.
రోజూ ఉదయం గనుల్లో కార్మికుల వచ్చే సమయానికి గనుల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభలు సమావేశాలతో కార్మికులను ఆకట్టుకున్నారు. మణుగూరు ప్రాంతంలో ఐఎన్‌టీయూసీకి కీలక నేతగా ఉన్న పిచ్చేశ్వరరావు లాంటి నాయకులను టీబీజీకేఎస్‌కు మద్దతు ఇచ్చేలా ఒప్పించగలిగారు. ఇతర కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి వారిని బాణం గుర్తు వైపు ఆడుగులు వేయించగలిగారు. మొదట నుంచి రెండు ఏరియాల్లో టీబీజీకేఏఎస్ గెలుపు కష్టమని వచ్చిన ప్రచారాన్ని మంత్రి తమ్ముల తన చతురతతో సింగరేణి కార్మిక వర్గాన్ని ఆకర్షించటంతో పాటు వారికి పలు హామీలు ఇవ్వటంతో మెప్పించగలిగారు. ఎన్నికల తరుణం దెగ్గరపడుతున్న కొద్ది ఇల్లెందు, మణుగూరు ఏరియా గనుల్లో కూడా గులాబీ జెండా ఎగురుతుందన్న నమ్మకాన్ని తెప్పించి ఎన్నికల్లో గెలుపును సులభతరం చేశారు. ఎమ్మెల్యేలు కొరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, ఎంపీ సీతారాంనాయక్, టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ ఎస్‌కే బుడాన్‌బేగ్ తదితరులతో కలిసి రోజూ ఉదయం సాయంత్రం సభలు సమావేశాలు నిర్వహించి సంగరేణి ఎన్నికల్లో గెలుపుద్వారా ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను తెలియజేశారు. తద్వారా ఆ రెండు ఏరియాల్లో ఫలితం ఒక్కసారిగా మారిపోయి విజయం టీబీజీకేఎస్‌కు దక్కింది.
Post Views: 264