టాలీవుడ్ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖా వాణి ఒకరు. అక్క, చెల్లి, వదిన, అత్త క్యారెక్టర్లలో ఈ మధ్య సురేఖ చాలా బిజీ అయ్యారు. ఆమె క్యారెక్టర్లన్ని ఇప్పటి వరకు హోమ్లీగానే చాలా పద్ధతిగానే ఉన్నాయి. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోయిన్లు, ఐటెం గర్ల్స్‌ను మించిపోయేలా హాట్ హాట్ ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. వాళ్ల సినిమాల్లో అదరిపోయే అడల్ట్ సీన్లలో రచ్చ రచ్చ చేసినా వాటి గురించి మీడియాలో, సైట్లలో వస్తే మాత్రం నానా హంగామా చేసేస్తున్నారు. ఇదిలా ఉంటే హోమ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరున్న సురేఖా వాణి ఇటీవల హాట్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నట్టే కనపడుతోంది.
సురేఖ వాణి కొద్ది రోజుల క్రితం ఆమె తన కుమార్తెతో కలిసి షార్ట్ డ్రెస్సులు వేసుకుని తన సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియో పెద్ద రచ్చ రచ్చ చేసింది. సురేఖలో ఇంత హాట్ నెస్ దాగి ఉందా.. అని టాలీవుడ్ జనాలు, అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి సురేఖ హీరోయిన్లకు ధీటుగా ఓ హాట్ ఫొటోతో అందరిని తన వైపునకు తిప్పుకుంది. ఇటీవల యూఎస్ ట్రిప్‌కు వెళ్లిన సురేఖ తీయించుకున్న ఓ హాట్ ఫొటో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బ్లాక్ కలర్ కారుమీద కూర్చుని ఫ్యాంట్ షర్ట్‌తో సోయగాలు చక్కగా చూపిస్తోంది. ఈ ఒక్క ఫొటోతోనే గ్లామర్ ప్రియులందరిని తన వైపునకు తిప్పుకున్న సురేఖ.. లేటు వయస్సులో హాట్ ఇమేజ్ కోరుకుంటున్నట్టే కనపడుతోంది.