Home / SLIDER / రేవంత్‌ డైలాగులు రివర్స్…సింగరేణి ఎన్నికలతో టీడీపీ దుకాణం బంద్..!

రేవంత్‌ డైలాగులు రివర్స్…సింగరేణి ఎన్నికలతో టీడీపీ దుకాణం బంద్..!

కేసీఆర్‌కు కార్మికులు చుక్కలు చూపించాలి..సింగరేణి ఎన్నికలు టీఆర్ఎస్‌ పతనానికి నాంది కావాలి…ఇవి టీటీడీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సింగరేణి ఎన్నికల ప్రయారంలో కొట్టిన డైలాగులు. రేవంత్ డైలాగులు రివర్స్ అయ్యాయి.. కార్మికులు రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించారు. సింగరేణి ఎన్నికలు ఆల్రెడీ తెలంగాణలో పతనమైన టీడీపీని శాశ్వతంగా భూస్థాపితం చేసినట్లయింది.

సింగరేణి ఎన్నికలను అధికార టీఆర్ఎస్‌తో పాటు ప్రతిపక్షాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సింగరేణి కాలరీస్ పరిధిలో దాదాపు 25 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 లోకసభా నియోజకవర్గాలు ఉన్నాయి..ఈ ఎన్నికల్లో తాము వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఈజీగా ఓడించవచ్చు అని భావించిన ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్, సిపీఐ పార్టీలు సైద్ధాంతిక విబేధాలు పక్కనపెట్టి ఏఐసీటీయూకు మద్దతు ఇచ్చాయి..అంతే కాదు ఎన్నడూ లేనంతగా ప్రతిపక్ష పార్టీల నాయకులు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క , చాడ వెంకటరెడ్డిలు తదితరులు సింగరేణి కాలరీస్ పర్యటించి టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో రేవంత్ రెడ్డి కూసిన కూతలు, పేలిన ప్రేలాపనలు అన్నీ ఇన్నీ కావు.. టీఆర్ఎస్‌ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌కు ఓటేస్తే సింగరేణిని అమ్మడం ఖాయం..కార్మికులను కేసీఆర్ మాయమాటలతో మోసం చేస్తున్నాడని, సింగరేణి ఎన్నికలు టీఆర్ఎస్ పతనానికి నాంది కావాలి అని శ్రీరాంపూర్‌లో రెచ్చిపోయి మాట్లాడాడు. అంతే కాదు వారసత్వ ఉద్యోగాలు నీ అయ్య కాళ్లు పట్టుకుని అడుక్కోవాల్సిన ఖర్మ కార్మికులకు లేదు…నడి రోడ్డులో నీ అయ్య జట్టుపట్టుకుని లాగి తీసుకుంటం మరీ అని ఎంపీ కవితను ఉద్దేశించి చాలా అమర్యాదకరంగా మాట్లాడాడు.అయితే శ్రీరాంపూర్‌లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐల ఉమ్మడి కూటమి ఏఐసీటీయూ ఓడిపోయింది. అక్కడ టీబీజీకేఎస్‌ గెలిచింది..దాదాపుగా అన్ని డివిజన్లలో రేవంత్ ప్రచారం చేసినా లాభం లేకపోయింది. 9 డివిజన్లలో టీబీజీకేఎస్ అఖండ విజయం సాధించింది..రేవంత్ ప్రచారం చేసిన రామగుండం, కొత్తగూడెంలో ఓడిపోయింది. మంద్రమర్రి, భూపాలపల్లిలో వామపక్ష కార్మిక సంఘాలు బలంగా ఉన్నందున ఏఐసీటీయూ గెలిచిందే తప్ప రేవంత్ ప్రచారం వల్ల ఒరిగిందేం లేదు..దీన్ని బట్టి రేవంత్‌ మాటలను ప్రజలు అడ్డగోలు వాగుడుగానే భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గత మూడున్నరేళ్లుగా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్యామిలీపై వ్యక్తిగత విమర‌్శలు చేయడం బూమరాంగ్ అవుతోంది. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఫ్యామిలీ ఎలా ముందుకు తీసుకువెళ్లిందో ప్రజలందరికీ తెలుసు.మరో వైపు ఆంధ్రా పాలకులకు మడుగులు ఒత్తుతూ తెలంగాణను అస్థిర పర్చడానికి ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగగా ముద్రపడిన రేవంత్ రెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు పూర్తిగా విశ్వసించడం కష్టం. చంద్రబాబు తొత్తుగా ఉన్నంతకాలం తన మాటకు తెలంగాణలో విలువ ఉండదన్న సంగతి రేవంత్ అర్థం చేసుకోకపోవడం ఆయన అవివేకానికి అద్దం పడుతుంది. టీడీపీని ఎప్పటికీ ఆంధ్రా పార్టీని భావిస్తారు తెలంగాణ ప్రజలు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నా రేవంత్ నోరు మెదపడం లేదని..ప్రజలు, రైతులు ఆగ్రహిస్తున్నారు..అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కకుండా అడ్రస్ గల్లంతు అయింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో తెలంగాణలో చావుదెబ్బతిన్న టీడీపీ ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు స్వయంగా సింగరేణి ఏరియాల్లో రేవంత్ తనదైన స్టైల్లో కేసీఆర్ ఫ్యామిలీపై రంకెలు వేసినా లాభం లేకుండా పోయింది..రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో బలమైన రెడ్డి సామాజికవర్గం తనవైపు ఉందనే భావనతో తనకు తానుగా ఎక్కువగా ఊహించుకుంటున్నాడు..నిజమే రాష్ట్రంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా రెడ్డి సామాజికవర్గం ఏకం అవుతుంది. అయితే రెడ్లు కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తారు తప్ప కమ్మ సామాజిక పెత్తనంలోని టీడీపీకి ఎట్టిపరిస్థితుల్లో మద్దతు ఇవ్వరు. ఈ వాస్తవం రేవంత్ రెడ్డి గ్రహించి కాంగ్రెస్‌లో చేరుతాడో లేదో చూడాలి. కాంగ్రెస్‌లో చేరితే ఓటుకు నోటు కేసును కేంద్రంలోని బిజేపీ సర్కార్‌తో కల్సి కేసీఆర్ తిరగతోడుతారని, మళ్లీ జైలుపాలు వస్తుందనే భయంతో రేవంత్ టీడీపీలోనే ఉండిపోతున్నాడు.. మరో వైపు కేసీఆర్‌తో పోరాటానికి సొంత పార్టీలోనే రేవంత్‌కు తోడుగా నిలబడేందుకు ఎవరూ ముందుకురావడం లేదు.టీడీపీ అధినాయకత్వం కేసీఆర్‌తో స్నేహానికి ప్రాధాన్యం ఇస్తోంది.

తెలంగాణ టీడీపీలో ఒక్క రేవంత్ రెడ్డి తప్పమిగిలిన టీడీపీ నాయకులంతా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడడంలేదని మొన్న మోత్కుపల్లి స్టేట్‌మెంట్‌తో క్లారిటీ వచ్చింది.మొత్తానికి సింగరేణి ఎన్నికలు టీఆర్ఎస్ పతానానికి నాంది అన్న రేవంత్ డైలాగులు రివర్స్‌ అయ్యాయి..సింగరేణి ఎన్నికలతో తెలంగాణలో టీటీడీపీని దాదాపుగా భూస్థాపితం అయ్యే పరిస్థితి ఏర్పడింది..ఇక టీటీడీపీలో మిగిలిన నాయకులు అంతా త్వరలో టీఆర్ఎస్‌లోనో, బిజేపీలోనో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఒంటరి అయిన రేవంత్ రెడ్డి కూడా పార్టీకి తాళం వేసి తాను కూడా మరో గూడు వెదుక్కునే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు వినాశకాలే విపరీత బుద్ధి..నోటికి అడ్డూ అదుపు లేకుండా మహిళ అని కూడా చూడకుండా కవిత లాంటి నాయకురాలని తిడితే ఉసురు ఇలాగే తగులుతుందని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి… మొత్తానికి సింగరేణి ఎన్నికలతో తమ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖం నల్లగా మాడిపోయిందని..మనోడి జీవితం మసిబారిపోయినట్లే అని తెలంగాణ తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారంట..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat