ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. అధికార టీడీపీ, జనసేనల మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండే అవకాశాలు దూరమవుతున్నాయి..చంద్రబాబు మాత్రం జనసేనతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాడు.. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే జనసేనతో పొత్తు కుదిరే అవకాశం కనిపించడం లేదు..వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించాడు. దీంతో మూడు పార్టీలు పోటీ చేస్తే ఓట్లు చీలి జగన్‌కు ఎక్కడ ప్లస్ అవుతుందో అని కంగారుపడుతున్న టీడీపీ మంత్రులు, పవన్ కల్యాణ్‌పై మాటల దాడి ప్రారంభించారు. గతంలో టీడీపీ సీనియర్ నాయకుడు, విజయనగరం ఎంపీ అశోక్ గజపతి రాజు పవన్ గురించి మాట్లాడుతూ… ఆయనెవరో నాకు ఐడియా లేదు. అందరూ అంటున్నారు ఎవరో సినిమావాడట.. నేను సినిమాలు చూసి చాలా ఏళ్లైంది. సినిమాల గురించి మాట్లాడితే నేనేం చెప్పను’ అని వెటకారం ఆడారు. తాజాగా మంత్రి పితాని సత్యనారాయణ కూడా మాకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీయేనని, రాష్ట్రంలో పవన్ కల్యాణ్ పార్టీ జెండానే లేదు కాబట్టి, ఆయన గురించి ఆలోచించే సమయం తమకు లేదంటూ పవన్‌ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులపై విమర్శలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. అశోక్‌గజపతి రాజుగారికి పవన్ కల్యాణ్ తెలియదు..పితాని సత్యనారాయణకు పవన్ కల్యాణ్ తెలియదు..సంతోషం అని వ్యంగంగా కౌంటర్ ఇచ్చారు. దీంతో పవన్ ట్వీట్‌ను బట్టి టీడీపీతో తెగతెంపులు చేసుకోవడం ఖాయం అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైసీపికి పవన్ మద్దతు పలకడం ఖాయం అని మెగాస్టార్ చిరంజీవి కూడా వైసీపీకి మద్దతు పలికే అవకాశం ఉందని ఏపీ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తనను అవమానించిన టీడీపీకి తన సత్తా ఏంటో చూపాలని పవన్ పట్టుదలతో ఉన్నాడని తెలుస్తుంది. పవన్ కల్యాణ్ వల్లనే గత ఎన్నికల్లో కాపులు, ప్రధానంగా యువత టీడీపీకి ఓటేశారు. ఇప్పటికే కాపుల్లో, యువతలో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ తరుణంలో పవన్ కూడా దూరం జరిగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నాడు.వాస్తవానికి చంద్రబాబుది కూడా వాడుకుని వదిలే రకం..జగన్ ఎఫెక్ట్‌తో పవన్ని దూరం చేసుకోవడానికి చంద్రబాబు వెనుకాడుతున్నాడు. అయితే టీడీపీ నాయకుల నోటి దురుసుతో పవన్ దూరం అయ్యే సూచనలు కనిపిస్తుండడంతో చంద్రబాబులో కలవరం మొదలైంది. మరి పవన్ని మరోసారి బుట్టలో పడేస్తాడో లేదా..జనసేనతో తెగ తెంపులు చేసుకుంటాడో చూడాలి.
