టీబీజీకేఎస్ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, నిజామాబాదు ఎంపీ కవిత అన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ప్రభంజనం సృష్టించిన సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మీద విశ్వాసంతో కార్మికులు టీబీజీకేఎస్‌ను గెలిపించారన్నారు. టీబీజీకేఎస్‌కు అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన కార్మికులకు కవిత కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కార్మికుల మనసు గెలుచుకునేలా పనిచేస్తామని ఆమె పేర్కొన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని కవిత హామీ ఇచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 9 డివిజన్లను గెలుచుకున్నామని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.
