సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ టీబీజీకేఎస్ విజయం సాధించడంతో సీఎం మీడియాతో మాట్లాడుతూ టీబీజీకేఎస్‌ను గెలిపించినందుకు కార్మికులకు కృతజ్ఞతలు చెప్పారు. కార్మికులకు అద్భుతమైన వెసులుబాటు కల్పించామని, చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేయలేదని అన్నారు. ఉద్యోగాలు ఇప్పించేందుకు తప్పకుండా కారుణ్య నియామకం కింద పరిగణించి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. అలా కాని పక్షంలో రూ. 25 లక్షలు ఇస్తామని చెప్పామని, ఇచ్చిన హామీలన్నీ తూ.చ. తప్పకుండా నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికలతో ప్రతిపక్ష నాయకులు బుద్ధి తెచ్చుకుని నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కేసీఆర్ సూచించారు. వారు చేసిన వ్యాఖ్యలు ప్రజల దృష్టిలో జోకుల్లా ఉన్నాయని, ఎవరూ విశ్వసించడం లేదని ఎద్దేవా చేశారు.రైతులకు పెట్టుబడి ఎప్పుడైనా ఇచ్చారా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు.
Post Views: 207