ఇవాళ ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ …. కోదండరామ్ తనను తాను ఎక్కువగా ఊహించుకుని పరేషాన్ అవుతున్నడని సీఎం అన్నారు. జేఏసీ ఏర్పాటు చేసినపుడు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉండేది. తెలంగాణ రాజకీయ నాయకత్వం ఒకటి కావాలనే జేఏసీ పెట్టినం. ఉద్యమంలో త్యాగాలు చేసిందే టీఆర్‌ఎస్. కోదండరాం జీవితంలో సర్పంచ్ అయిండా..?, కోదండరాం చేసిన ఏ ఒక్క యాత్రకైనా 500 మంది అయినా వచ్చిన్రా..? అని సీఎం ప్రశ్నించారు. టీజీబీకేఎస్ గిలిస్తే సింగరేని నాశనమైతని కోదండరాం అంటున్నడు. సింగరేణి ఎట్లా నాశనమైతదో కోదండరాం చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడటం కోదండరాంకు ఇష్టం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కోదండరాం ఢిల్లీకి పోయి సోనియాగాంధీ దిగ్విజయ్‌సింగ్‌తో దొంగతనంగా మంతనాలు చేసిండు. ప్రభుత్వాన్ని విమర్శించడమే కోదండరాం ఎజెండాగా పెట్టుకున్నడని సీఎం మండిపడ్డారు.. కేసీఆర్ తెలంగాణను తెచ్చింది నిజం కాదా..? అని సీఎం ప్రశ్నించారు. కోదండరాం లాంటి వాళ్లను తెలంగాణ ప్రజలు పట్టించుకోవద్దని సీఎం కోరారు.
రైతు సమన్వయ సమితులను అడ్డుకునేందుకు హైకోర్టులో కేసు వేసిన్రు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గ్రీన్ ట్రిబ్యునల్‌లో స్టే తీసుకొచ్చింది మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహనేనని సీఎం తెలిపారు. తాగిపాముల దగ్గర ఉత్తమ్‌కుమార్ రెడ్డికి గడీ ఉంది. అమెరికా, బెంగళూరు, ముంబైలో వర్షాలు వస్తే కష్టాలు లేవా..? హైదరాబాద్‌లో వర్షం వస్తేనే కష్టాలు కనిపిస్తున్నాయా..? సీఎం ప్రశ్నించారు.
ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. అవసరాల మేరకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తదని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణలో ఎక్కడికి పోయి పోటీ చేసినా ప్రజలు నన్ను గెలిపించారు. తెలంగాణ గతంలో కంటే ఎక్కువ సంతోషంగా ఉంది. ప్రతీ నయాపైసా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేస్తున్నట్లు సీఎం పునరుద్ఘాటించారు. అప్పులు తేవొద్దు..అభివృద్ధి చేయొద్దన్నదే విపక్షాల ఎజెండా అని సీఎం ఆరోపించారు.