దేవదాసు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా గురువారం ముంబయిలో జరిగిన ఓ ఫ్యాషన్ కార్యక్రమానికి ఇలియానా హాజరైంది. ఈ సందర్భంగా తన సినిమాల గురించి, దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఇల్లి బేబి మహేష్ పై హాట్ కామెంట్స్ చేసింది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మహేష్ అంటే అసలు తెలియదని, ఆ తర్వాత మహేష్ గురించి తెలుసుకున్నానని పోకిరి సినిమా తర్వాత మహేష్ బాగా క్లోజ్ అయ్యాడని చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి ఎయిర్‌హోస్టెస్ కావాలన్నది నా కల. ఎందుకంటే ఉచితంగా ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ వైపు మనసు మళ్లింది. కాలేజ్ రోజుల్లో క్లాస్ జరుగుతున్నప్పుడు లాస్ట్ బెంచ్‌లో కూర్చుని డిజైన్లు వేస్తూ ఉండేదాన్ని. తర్వాత సైకాలజీ చదవాలనుకున్నా. అయితే ఆ దేవుడు నాకోసం వేరే మార్గాన్ని కనుగొన్నాడు. అదే సినిమా రంగం. అలా 16 ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమకు వచ్చానని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం అమ్మడికి తెలుగులో అవకాశాలు రాకపోయినా అప్పుడప్పుడు హిందీ అవకాశాలు అమ్మడి తలుపు తడుతున్నాయి కానీ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్‌లు గానే మిగులుతున్నాయి.
