సోషల్‌మీడియాలో చిల్లర గ్యాంగ్ విషపు రాతలు రాస్తున్నాయని సీఎం మండిపడ్డారు.ఇవాళ ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. ఇపుడు దొర ఎవరైనా ఉన్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డేనని..పీసీసీ అధ్యక్షుడు మితిమీరి విచ్చలవిడిగా మాట్లాడుతున్నడన్నారు. ముఖ్యమంత్రిని, మంత్రులను, ప్రజాప్రతినిధులను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
సింగరేణి కార్మికుల సొంతింటి కోసం రూ. 6లక్షలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రైతులకు ఎకరానికి రూ. 8వేలు పెట్టుబడి ఇస్తామన్నం. ఇటువంటి ఆలోచన దేశంలో ఏ పార్టీకి రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు. 1998లో సంతకాలు పెట్టి డిపెండెంట్ ఉద్యోగాలు పొగొట్టిందే జాతీయ సంఘాలని సీఎం విమర్శించారు. డిపెండెంట్ ఉద్యోగాలపై కోర్టుకు పోయి స్టే తెచ్చింది కూడా వాళ్లేనన్నారు. కారుణ్య నియామకాల కింద డిపెండెంట్ ఉద్యోగాలు కల్పిస్తమని సీఎం స్పష్టం చేశారు. మంచి కార్యక్రమాలకు ప్రతిపక్షాలు సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భూరికార్డులను ప్రక్షాళన చేస్తుంటే విమర్శించడం సరికాదని సీఎం సూచించారు. సింగరేణిలో బీజేపీ అనుబంధ సంఘానికి వచ్చింది 246ఓట్లని తెలిపారు.