టాలీవుడ్ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూకి బాలకృష్ణ ఇటీవల వరుసగా బాలయ్య తన అభిమానులపై చేయి చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిపై సోషల్ మీడియా పలు రకాల వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. అయితే వీటిపై తాజాగా బాలయ్య స్పందించాడు. బాలయ్య మాట్లాడుతూ.. ఎవరెన్ని రాసినా డోంట్ కేర్.. నా అభిమానులని అడగండి.. వాళ్లే చెబుతారు. రేయ్ నిను తిట్టాడా, నన్ను కొట్టాడురా అంటూ గొప్పగా ఫీలవుతారని చెప్పుకొచ్చాడు. నా చేయి తగిలితే వడికొక అనందం అంటూ చెప్పాడు. రాసేవాళ్ళకి ఏమి తెలుసు.. వాళ్ళ బొంద తెలుసు అంటూ విమర్శించాడు.
అంతటితో ఆగకుండా అనవసరంగా నేను కొట్టను, అవతలోడు రెచ్చిగొట్టినా, లేక తప్పు చేసినప్పుడు మాత్రమే ఆలా జరుగుతుందని అన్నాడు. ఇదంతా నాకు అభిమానులకి మధ్య ఉండేది.. మధ్యలో ఎవరొచ్చినా వాడికి ట్రీట్ మెంట్ వేరుగా ఉంటుందని చెప్పాడు. దీంతో బాలయ్య పై సోషల్ మీడియాలో నెటిజన్లు మరోసారి సెటైర్లు వేస్తున్నారు. బాలయ్య మ్యాన్షన్‌హౌస్ వేసి తన అభిమానులను కొట్టడమే కాకుండా.. ఇప్పుడు అదే మ్యాన్షన్‌హౌస్ వివరణ ఇస్తున్నారని.. కొన్ని జీవితాలు అంతే.. వారిన ఎవరేం మార్చలేరని బాలయ్య పై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.