తెలుగు బుల్లితెర పై ఈ మధ్య ఎంటర్టైన్‌మెంట్ ఛానెళ్ళు టీఆర్పీ పెంచుకోవడానికి ప్రోమోలతో ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయి. ఏదో హైప్ క్రియేట్ చేసి.. టీఆర్‍పీ పెంచుకోవడం కోసం ఇలా చేస్తున్నరన్న విషయం ప్రేక్షకులకు ఈజీగా అర్దం అవుతోంది. ప్రతి ఎపిసోడ్ కి అదే విధంగా క్రియేట్ చేయడంతో ఆఖరికి వారు నిజంగా ఏడ్చినా నటనే అనుకునే స్థాయికి ప్రేక్షకులు వెళ్లిపోయారు. ఈ మధ్య హీరో రానా ఒక టీవి యాంకర్‌ని తిడుతున్నట్టు వచ్చిన ప్రోమో చూసాక.. మొదట్లో ఏమైంది.. రానా ఎందుకలా బిహేవ్ చేశాడు.. అనుకున్న వాళ్లు కూడా తర్వాత ఆ ప్రోగ్రాం చూసి తిట్టుకున్నారు.
అదొక్కటే కాదు ప్రతి ప్రోగ్రాం ప్రోమోని కూడా ఓవర్ యాక్షన్ అనే రేంజ్ కి వెళ్లిపోయారు..తాజాగా యాంకర్ లాస్య భోరున విలపించినట్లుగా ప్రోమోలో చూపిన విషయానికొస్తే.. రేణు దేశాయ్ జడ్జిగా, ఉదయ భాను యాంకర్ గా వస్తున్నరొమాంటిక్ డాన్స్ షో నీతోనే డాన్స్. 8 మంది సెలబ్రిటీ కపుల్స్ ఇందులో పార్టిసిపంట్స్. ఈ షో సరికొత్త ఎపిసోడ్ ప్రోమో లో లాస్య కంటతడి పెట్టుకుంటుంది.. దానికి కారణం ఏంటో ఫుల్ ఎపిసోడ్ చుస్తే కానీ తెలీదు. ఇప్పటికయితే లాస్య ఏడ్చిన సీన్ తో కూడిన ప్రొమో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.