సింగరేణికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూలేని విధంగా 9 డివిజన్లను తెలుచుకున్నామని బాల్కసుమన్ తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఎంపీ బాల్కసుమన్ మాట్లాడుతూ విపక్ష సంఘాల కుట్రలను కార్మికులు తిప్పి కొట్టారన్నారు. కోదండరాం పిలుపును సింగరేణి కార్మికులు తిప్పికొట్టారని, ఇప్పటికైనా కోదండరాం ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సింగరేణి అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పునరుద్ఘాటించారు. వారసత్వ ఉద్యోగాలను ఇచ్చి తీరుతమని బాల్క సుమన్ స్పష్టం చేశారు.