టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ సినిమా విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ విజయంతో అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్న సమయంలోనే మహేశ్ వారికి మరో సర్‌ప్రైజ్ ఇచ్చేశారు. ఆయన నటిస్తున్న ‘భరత్ అనే నేను’ ఫస్ట్‌లుక్ విడుదలైంది.
కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్ర వర్గాలు సోషల్‌మీడియాలో విడుదల చేశాయి. ఫస్ట్‌లుక్‌లో మహేశ్ ఎప్పటిలాగే హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు. పక్కన ఇద్దరు గన్‌మెన్‌లతో నడిచొస్తున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. ఆయన వెనక బ్రహ్మాజీ కూడా ఉన్నారు. ఇందులో మహేశ్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో మహేశ్‌కి జోడీగా బాలీవుడ్ నటి కైరా అడ్వాణీ నటిస్తోంది.ఉత్తర్‌ప్రదేశ్‌లో చిత్రీకరణ కొంతభాగం జరిగింది. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
