భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్‌కు గాయమైంది. గురువారం ప్రాక్టీస్‌లో పాల్గొన్న సమయంలో స్మిత్ భుజానికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన మేనేజ్‌మెంట్ సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎమ్మారై స్కాన్ నిర్వహించిన వైద్యులు గాయం తీవ్రమైందేమీ కాదని చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. టీ20కి సిద్ధం కావొచ్చని చెప్పడంతో వారంతా వూపిరి పీల్చుకున్నారు.
మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా రాంచీలో తొలి టీ20 శనివారం జరగనుంది. ఈ నేపథ్యంలో రాంచీలోని జేఎస్‌సీఏ మైదానంలో ఆసీస్ ఆటగాళ్లు గురువారం ఉదయం నిర్వహించిన ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే స్మిత్‌కు గాయమైంది. ఇప్పటికే 4-1తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన స్మిత్ సేన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కసితో ఉంది.
