తల్లీకూతుళ్లు ఒకేసారి తల్లులయితే? నిజంగా అద్భుతం కదూ. సిరియాకు చెందిన ఓ తల్లి, ఆమె కూతురు ఇలాగే ఒకేసారి మగ బిడ్డలకు జన్మనిచ్చారు. 42 ఏళ్ల ఫాతిమా బిరిన్సీ, ఆమె కుమార్తె 21 ఏళ్ల గేడ్ బిరిన్సీ టర్కీలోని కొన్యా నగరంలో సిజేరియన్ ద్వారా ఒకే సమయంలో పిల్లలకు జన్మనిచ్చారు. టర్కీకి చెందిన న్యూస్ వెబ్‌సైట్ ఎన్సాన్‌హబెర్ ఈ వార్తను ముందుగా ప్రచురించింది. తల్లీకూతుళ్లకు ఒకేసారి పిల్లలు పుట్టడం నిజంగా అద్భుతమని, ఇలాంటి ఘటనలను ఇంతకు ముందెప్పుడూ తాను చూడలేదని డాక్టర్ నయిమ్ ఉన్సాల్ తెలిపారు. గతంలో ఫాతిమాకు సిజేరియన్ ద్వారానే కాన్పులు చేశారని ఆయన తెలిపారు.
సిరియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల కారణంగా మూడేళ్ల క్రితం ఇరు కుటుంబాలు శరణార్థులుగా టర్కీకి వలస వెళ్లాయి. తమకు ఆశ్రయం కల్పించిన టర్కీ అధ్యక్షుడు రెసెపె తయ్యిప్ గౌరవార్థం.. వారు తమ పిల్లలకు రెసెప్, తయ్యిప్ అని పేర్లు పెట్టారు.