సింగరేణి సంస్థ గుర్తింపు సంఘానికి గురువారం జరిగిన ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ప్రభంజనం సృష్టించింది. కార్పొరేట్, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, రామగుండం-1,2,3, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ ఏరియాల్లో టీబీజీకేఎస్ ఘన విజయం సాధించింది. ఫలితాలు వెలువడిన వెంటనే టీబీజేకేఎస్ నాయకులు రంగులు చల్లుకొని, పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకున్నారు. సింగరేణిలో ఆనందోత్సాహాలతో బైక్ ర్యాలీలు నిర్వహించారు. కోల్‌బెల్ట్‌లో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొన్నది.
