తెలుగు సినీ పరిశ్రమని కొన్ని నెలల క్రితం కుదిపేసిన డ్రగ్స్ కేసులో సినీ సెలబ్రిటీలని విచారించిన తర్వాత కొద్దిగా సద్దుమణిగింది అనుకునే లోపే టాలీవుడ్‌పై మరో బాంబు పేలింది. డ్రగ్స్ కేసులో సిట్ అధికారులకు విచారణలో భాగంగా బ్లడ్ శ్యాంపిల్స్ ఇచ్చిన సినీ ప్రముఖుడి రిజల్ట్ ఇప్పుడు హట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ఫోరెన్సిక్ ల్యాబ్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ లో పాజిటివ్ అంటూ బాంబు పేలింది. అయితే సదరు విషయాన్ని అధికారులు ఇంకా అఫీషియల్‌గా ప్రకటించలేదు. కారణం అదే శాంపిల్‌ను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు కూడా పంపించి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని నిర్ణయించారు.
అయితే ఆ విషయం అప్పటిదాకా అంతా గప్ చుప్..ఈ విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, పోలీసులు పెదవి విప్పకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రేపటిరోజున సెకండ్ ఒపీనియన్ కూడా పాజిటివ్ అని తేలితే ఏం చేస్తారు.. అరెస్ట్ చేస్తారా.. లేక మాదకద్రవ్యాలు వాడకూడదంటూ కౌన్సిలింగ్ ఇస్తారా అన్న విషయం తెలియాల్సిఉంది. ఏదిఏమైనా అతను మాదకద్రవ్యాలు వాడినట్లు రుజువయితే.. అవి ఎక్కడినుంచి కొనుగోలు చేశారు.. ఒకవేళ ఆరోగ్య కారణాల చేత వాడానని చెబితే అందుకు ఏ డాక్టర్ అనుమతి ఇచ్చాడన్న విషయం కూడా విచారించాల్సి వస్తుంది. ఇవన్నీ సదరు సినీ సెలబ్రిటీకి తెలిసే ఉండాలి.