ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడంతో అధికార టీడీపీ.. పచ్చమీడియా వారు వైసీపీని దెబ్బ తీయడానికి నానా రకాలుగా కంటి మీద కునుకులేకుండా అనేకానేక దొంగపథకాలు రచించినా.. జగన్ టీం వాటిని తిప్పికొడుతున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత టీడీపీ అనుకూల మీడియా వైసీపీ నేతల్లో చాలామంది టీడీపీ అధిష్టానానికి టచ్‌లో ఉన్నారని వారు త్వరలోనే టీడీపీలోకి జంప్ కానున్నారని తప్పుడు కథనాలు ప్రచురించింది. అయితే ఇప్పటికి కూడా ఒక్కరు కూడా వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళలేదు. ఇంకా టీడీపీ కాంగ్రెస్ నుండి అనేక మంది నేతలు, కార్యకర్తలు.. ముఖ్యంగా వైసీపీ చేపట్టిన వైఎస్సార్ కుంటుంబంలోకి అయితే ఇప్పటికే 80 లక్షలమంది వచ్చి చేరారు. అలాంటిది ఇప్పుడు తాజాగా రెండు రోజులనుండి టీడీపీ అనుకూల మీడియా మరో దిక్కుమాలిన కథనాన్ని ప్రచురించి మరోసారి డప్పుకొడుతోంది.
అసలు విషయం ఏంటంటే వైసీపీ నుండి అయిదుగురు నేతలు టీడీపీలోకి వెళుతున్నారని.. వారిలో ఎంపీ భుట్టా రేణుక సహా కర్నూలు నుంచి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు, అనంత మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరనున్నారని మరోసారి బుర్రతక్కువ కథనాన్ని వండి వాడ్చి వడ్డించింది. అయితే ఆ పచ్చ మీడియా ఒక చిన్న లాజిక్ మిస్సైంది.. అదేంటంటే గతంలో వైసీపీ నుండి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేల పరిస్థితి టీడీపీలోకి వెళ్ళాక ఎంత ఘోరంగా ఉందో అందరికీ తెలిసిందే. ఇక నియోజక వర్గాలు పెరిగితే సీట్లు సర్దుబాటు చేయాలనుకున్న చంద్రబాబుకు మోదీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఎప్పటి నుండో నమ్ముకున్న వారికి హ్యాండిచ్చిన చంద్రబాబు పై టీడీపీ వర్గీయులే అసంతృప్తితో ఉన్నారు. అలాంటిది నంద్యాలలో కోట్లు కుమ్మరించి టీడీపీ గెలిచినా వైసీపీ తన ఓటు బ్యాంకును నిలుపుకుంది.. ఇప్పుడు తాజాగా నవరత్నాలు, వైఎస్సార్ కుటుంబం లాంటి జనాకర్షణ పథకాలతో ప్రజల్లోకి దూసుకుపోతుంది. ఇక టీడీపీ ఇంటింటా తెలుగు దేశం అంటూ ప్రజల్లోకి వెళ్ళగా.. అన్ని నియోజక వర్గాల్లో టీడీపీ నేతలకి ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. అలాంటిది టీడీపీ లోకి మా నేతలు ఎందుకు వెళతారు అంటూ వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఏది ఏమైనా టీడీపీ అనుకూల మీడియా వేసిన మరో పచ్చ స్కెచ్ అంతా డమ్మీ అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.