రోజు రోజుకీ దేశంలో ఆడవారిపై లైంగిక వేధింపులు పెరిగిపోతూనే ఉన్నాయి.. విధుల్లో భాగంగా రిపోర్టింగ్ చేసే మహిళా జర్నలిస్టులు కూడా అత్యాచారాలు, లైంగిక వేధింపులకు గురవుతుననారు. ఓ మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించిన ఆరోపణల కింద ఓ సెక్యూరిటీ గార్డును బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గత నెల మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ బెంగళూరు వచ్చి ఓ హోటల్‌లో బస చేశారు.దీంతో ఆయన్ని ఇంటర్వ్యూ చేసేందుకు ఓ టీవీ ఛానల్‌కు చెందిన మహిళా జర్నలిస్ట్ ఆయన అనుమతి తీసుకుని మరీ హోటల్‌కు వచ్చారు..కానీ ఆ హోటల్ దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకుని వేధింపులకు పాల్పడ్డారు. లైంగికంగా వేధించడంతో పాటు సెక్యూరిటీ పేరుతో ఒళ్లంతా తడిమి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సెక్యూరీటీ గార్డుల్లో ఒకరిని వేలాయుధన్ అనే వ్యక్తిని గుర్తించి మహదేవపురాలో అరెస్ట్ చేశారు..వేలాయుధన్‌తో పాటు మహిళా జర్నలిస్ట్‌ను లైంగికంగా వేధించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేయాల్సింది. కాగా మహిళా జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపులపై బెంగళూర్‌లో సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. బెంగళూరు రోజు రోజుకీ కామాంధులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని…మహిళలకు ఏ మాత్రం రక్షణ లేని సిటీగా బెంగళూరు మారుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం లైంగిక వేధింపులకు, ఈవ్ టీజింగ్‌కు పాల్పడే అగంతుకులపై కఠిన శిక్షలు అమలు చేయాలని..యువత మైండ్ సెట్ మారే విధంగా చర్యలు తీసుకోవాలని సిద్ధ రామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు..ఓవరాల్‌గా ఐటీ రాజధాని అయిన బెంగళూరు క్రైమ్ సిటీగా పేరు తెచ్చుకోవడం విచారకరం.
