టాలీవుడ్ క్యూట్ లవ్ బర్డ్స్ అక్కినేని నాగ చైతన్య , సమంతలు మరి కొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. హిందూ , క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం రెండు పద్ధతుల్లో జరగబోయే వీరి పెళ్ళికి గోవా వేదిక కానుంది. ఇప్పటికే అక్కడ పెళ్లి పనులన్నీ పూర్తి కాగా , అతిధులు కూడా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యం లో ఎప్పుడూ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే సమంత పెళ్లి టైం లో కూడా దానిని వదలడం లేదు. తాజాగా సమంత చేసిన ట్వీట్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంతకీ సమంత చేసిన ట్వీట్ ఏంటి అంటే నాకు మీ అవసరం వచ్చినపుడు నా పక్కన నిలబడిన మీ అందరికీ థాంక్స్.. నా ఫ్రెండ్స్ అభిమానులందరికీ నా ధన్యవాదాలు.. ఐ లవ్ యూ. ఆస్క్ సామ్-3పీఎం అంటూ రెండు లవ్ సింబల్స్ పెట్టి సమంత ట్వీట్ చేసింది. కొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకుని ఇలా అభిమానులతో ఛాటింగ్ ప్రోగ్రాం పెట్టావంటే.. నీవు అభిమానులకు ఎంత విలువిస్తావో అర్థమవుతోందంటూ ఓ అభిమాని ట్వీట్ చేశారు.