ఆంద్రప్రదేశ్ దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కనున్న సినిమాపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తారక్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఎవరైనా సినిమా తీయవచ్చని..ఇలాంటి వాటిని ఎవరైనా ఆపగలరని తాను భావించటం లేదని అన్నారు. ఆయన జీవిత కథతో సినిమాలో నటిస్తారా.. అన్న ప్రశ్నకు మాత్రం జూనియన్ ఎన్టీఆర్ నో అని చెప్పేశాడు. ఎన్టీఆర్ ఆ రోజుల్లో కుటుంబాన్ని విడిచి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వెళ్లారని అన్నాడు. ఎన్టీఆర్ రాష్ట్ర ప్రజల ఆస్తిగా మారారని వ్యాఖ్యానించాడు. ఆయన జీవిత చరిత్రపై సినిమా తీస్తామని ఎవరు ముందుకొచ్చినా, వారిని మరొకరు ఆపగలరని తాను అనుకోవడం లేదని చెప్పాడు. అయితే, ఎన్టీఆర్ పాత్రలో తాను మాత్రం నటించబోనని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. అంత ధైర్యం తనకు లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
