తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో నేడు, రేపు ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంపై ఉపరితలం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా ఉన్నదని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండురోజులపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గురువారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో మరో రెండు, మూడురోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని.. దాని దిశనుబట్టి రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరుగవచ్చని తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా జడ్చర్లలో 7 సెం.మీ, మేడ్చల్, యాచారం, పాల్వంచల్లో 5 సెం.మీ., వనపర్తి, వెంకటాపురంలో 3 సెం.మీ, సరూర్‌నగర్‌లో 2 సెం.మీ.చొప్పున వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.
