ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు సరికొత్త చిక్కు వచ్చి పడ్డది .ఒకవైపు అండగా ఉంటది అని భావించిన ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ పార్టీ చేతులు ఎత్తేసింది .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో దాదాపు ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను అధికారాన్ని ,పదవులను ,నోట్ల కట్టలను ఎరవేసి టీడీపీ పార్టీలోకి గుంజుకున్నాడు బాబు .
గత సార్వత్రిక ఎన్నికల మాదిరిగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా అయిన గెలవాలని బాబు పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తోన్నారు .ఈ తరుణంలోనే కేంద్ర సర్కారు చేతులెత్తేసింది .వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు రాష్ట్రంలోని నియోజక వర్గ పునర్విభజన జరుగుతుంది అని చంద్రబాబు ఆలోచించాడు .అందుకే వైసీపీ నుండి నేతలను ఆదరాబాదర తమ పార్టీలోకి గుంజుకున్నాడు .ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ సర్కారు 2024 వరకు నియోజక వర్గాల పెంపు అనేదే ఉండదు అని తేల్చేసింది .
దీంతో బాబుకు కక్కలేక మ్రింగలేని పరిస్థితి ఏర్పడింది .వైసీపీ నుండి వచ్చిన నేతలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వాలంటే పార్టీనే అంటిపెట్టుకొని ఉంటున్న టీడీపీ నేతలకు మొండి చేయి చూపించాలి .మధ్యలో వచ్చిన వారికీ సీట్లు కేటాయిస్తే అనాదిగా పార్టీని అంటిపెట్టుకున్న టీడీపీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయం .ఒకవేళ ఫిరాయింపు నేతలకు టికెట్లు ఇవ్వకుండా తమ పార్టీకి నేతలకు కేటాయిస్తే ఫిరాయింపు నేతలు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయం .ఇప్పటికే జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ..పార్టీ పదవుల్లో తమకు స్థానాన్ని కల్పించకుండా ఫిరాయింపు నేతలకు కేటాయించారు అనే సంఘటనతో తెలుగు తమ్ముళ్ళు తీవ్ర నిరాసక్తిలో ఉన్నారు .ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వకపోతే వారు పార్టీ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని బాబు వ్యక్తిగత ఇంటిల్ జెన్స్ వర్గాల రిపోర్టు అందింది అంట .దీంతో బాబు ఫిరాయింపు నేతలకు ఇవ్వాలా ..?.తమ పార్టీకి చెందినవారికి ఇవ్వాలా ..?.అని బాబు తెగ గింజుకుంటున్నాడు అంట .