హైదరాబాద్ లోని బషీర్‌బాగ్‌లో భారతీయ విద్యాభవన్‌లో ఆదికవి శ్రీ వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కడియం… వాల్మీకి బంధువులందరి అభిమానంతో ఈ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతున్నదని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రూ.70 కోట్లతో 24 వేల చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
