తెలంగాణ రాష్ట్ర౦లో వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలో రైతు బజార్ ను మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… సాధించిన తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. నాగార్జున సాగర్ నీళ్లను ఆంధ్రకు దోచుకుపోతున్నా..నోరు మెదపని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని జగదీష్ రెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమం సందర్భంగా టీఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ నరేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, తదితరులు పాల్గొన్నారు.