Home / SLIDER / వచ్చే నెల 5వ తేదీలోపు బత్తాయి మార్కెట్ నిర్మాణం పూర్తి…!

వచ్చే నెల 5వ తేదీలోపు బత్తాయి మార్కెట్ నిర్మాణం పూర్తి…!

తెలంగాణ రాష్ట్ర౦లోని నల్లగొండ జిల్లాలో బత్తాయి, నిమ్మ, దొండ మార్కెట్ల నిర్మాణం జరుగుతున్నదని..రెండు, మూడు నెలల్లో వాటిని పూర్తి చేస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. వచ్చే నెల 5వ తేదీలోపు బత్తాయి మార్కెట్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
జిల్లాలో గతం కంటే 20 రెట్ల స్థాయిలో 2.35 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించినట్లు తెలిపారు. నల్లగొండ పట్టణంలో మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి రైతు బజార్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ 73 లక్షలతో రైతు బజార్ ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

నల్లగొండ పట్టణంలో గతంలో వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు ఉంటే.. టీఆర్ ఎస్ ప్రభుత్వం 10 వేల మెట్రిక్ టన్నుల గోదాములను నిర్మించిందని హరీశ్ రావు స్పష్టం చేశారు.. జిల్లాలో 2.35 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను గత మూడేళ్ల కాలంలో నిర్మించినట్లు వెల్లడించారు. గతంతో పోలిస్తే ఇది 20 రెట్లు ఎక్కువన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోసం ధర్నాలు చేశారు. కానీ ఇప్పుడు 24 గంటల కరెంటు ఇస్తున్నా..రైతులు 12’గంటల కరెంటును కోరుకుంటున్నారన్నారు.

దశాబ్ధాలుగా పెండింగ్ లో ఉన్న ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. వచ్చే జనవరి నాటికి బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్‌లో నీళ్లు పోస్తామని తెలిపారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. నల్లగొండ పట్టణం సమీపంలోని ముత్తిరెడ్డి కుంట.. మినీ ట్యాంక్ బండ్‌కు ప్రతిపాధనలు పంపిస్తే పరిశీలిస్తామని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat