సరిగ్గా ఇరవై నాలుగు యేండ్ల కింద అంటే 1993 ఏడాదిలో వరుస బాంబు పేలుళ్లతో దేశంలోనే ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబైలో మారణహోమం సృష్టించి, కొన్ని వందలాది మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్… మరోసారి ముంబైలో మారణహోమానికి స్కెచ్ వేసినట్టు ముంబై నగర పోలీసులు చెబుతున్నారు.
దావూద్ ముఖ్య అనుచరుడు అనీస్ ఇబ్రహీం ద్వారా దాడులు చేయాలని పథకం రచించారని వారు అంటున్నారు. దావూద్, అనీస్ ఇబ్రహీంల మధ్య ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేయడంతో ఈ కుట్ర బయటపడిందని పోలీసులు తెలిపారు. ఈ కుట్ర బట్టబయలు కావడంతో ముంబై పోలీసులు అలర్ట్ అయి దీనికి సంబంధించి దర్యాప్తును ప్రారంభించారు.
8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.అయితే అండర్ వరల్డ్ డాన్ దావూద్ పాకిస్థాన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అతన్ని అప్పగించాలంటూ భారత్ ఎన్నోసార్లు కోరినా… దావూద్ తమ దేశంలో లేడంటూ పాకిస్థాన్ దేశం సతాయిస్తుంది .