ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీలోకి లోకి వలసలు జోరందుకున్నాయి. ఇటీవల నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పరాజయం పొందిన వైసీపీ ఏమాత్రం ఖంగుతినకుండా.. నవరత్నాలు, వైఎస్సార్ కుటుంబం పథకాలతో ప్రజల్లోకి దూసుకుపోతుంది. ఇప్పటికే వైఎస్సార్ కుటుంబంలో 80 లక్షల మంది వచ్చి చేరగా.. అనేక మంది ముఖ్య నేతలు, కార్యకర్తలు కూడా వైసీపీలోకి క్యూలు కడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ నేత పీజేఆర్ సుధాకర్‌బాబు వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సుధాకర్‌బాబు తన అనుచరులతో కలిసి పార్టీలోకి వచ్చారు. సుధాకర్‌బాబు గతంలో యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ.. ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటున్న వైసీపీలోకి పలువురు నేతలు చేరుతున్నసంగతి తెలిసిందే.
